ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

ROBBERY ATTEMPT: బ్యాంకు చోరీకి దుండగుల విఫలయత్నం - CRIME NEWS

విశాఖ జిల్లా దొండపేట - ఎర్రవరం జంక్షన్ లోని ఎస్బీఐ బ్రాంచ్ లో.. దొంగలు చోరీకి విఫలయత్నం చేశారు. అర్ధరాత్రి వేళ ఈ ఘటన చోటుచేసుకున్నట్లు పోలీసులు తెలిపారు. నిందితుల కోసం గాలిస్తున్నారు.

ROBBERY ATTEMPT
ROBBERY ATTEMPT

By

Published : Aug 31, 2021, 5:00 PM IST

విశాఖ జిల్లా నర్సీపట్నం - తుని ప్రధాన రహదారిలోని నాతవరం మండలం తాండవ కూడలి వద్ద దొండపేట - ఎర్రవరం జంక్షన్ లోని స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (SBI) శాఖలో దుండగులు దోపిడీకి యత్నించి విఫలమయ్యారు. సోమవారం అర్ధరాత్రి ఈ ఘటన జరిగిట్లు నాతవరం పోలీసులు గుర్తించారు. రాత్రి 10 గంటల సమయం వరకు పరిసర వ్యాపారులంతా మేల్కొనే ఉన్నారమని తెలిపారు.

అప్పటివరకూ తమ ప్రాంతంలో ఎలాంటి అలికిడి లేదని స్థానికులు స్పష్టం చేశారు. అర్థరాత్రి 12 గంటల సమయం దాటాకే బ్యాంకులో సొమ్మును కాజేసేందుకు ప్రధాన ద్వారాల తలుపులు పగలగొట్టారని ఎస్సై శేఖర్ పేర్కొన్నారు. బ్రాంచ్ మేనేజర్ ఫిర్యాదు మేరకు క్లూస్ టీమ్ సహాయంతో ఆధారాలను సేకరించామని తెలిపారు. నిందితులను గుర్తించేందుకు ముమ్మర దర్యాప్తు చేస్తున్నట్లు చెప్పారు.

ABOUT THE AUTHOR

...view details