ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

విశాఖ ఏజెన్సీలో దారి దోపిడీ కలకలం.. భయాందోళనలో స్థానికులు - Vaisakha agency Robbery scandal news

విశాఖ ఏజెన్సీలో మరో దారిదోపిడీ కలకలం స్పష్టించింది. ఓ వ్యక్తి చికిత్స కోసం కారులో నర్సీపట్నం వెళ్తుండగా దారాలమ్మ ఘాట్ రోడ్డులో కొందరూ తుపాకీతో బెదిరించి నగదు, వాహనంతో పరారయ్యారు. దీంతో దారకొండ పరిసర ప్రాంత ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు.

robbery
robbery

By

Published : Feb 22, 2021, 8:40 PM IST

విశాఖ జిల్లా జీకే వీధి మండలం కుమ్మరాపల్లి గ్రామానికి చెందిన అప్పారావు అనే గిరిజనుడు.. చికిత్స నిమిత్తం తెల్లవారుజామున కారులో నర్సీపట్నం వెళ్తున్నారు. ఈ క్రమంలో దారాలమ్మ ఘాట్ రోడ్డులోని మూడో మలుపు వద్ద వాహనం ఆగింది.. కొద్దిసేపటి తర్వాత కారు స్టార్ట్​ చేసి వెళ్తుండగా.. ఇంతలో కొందరు వచ్చి డ్రైవర్​ తలపై తుపాకీ గురి పెట్టి కారు ఆపారు. వీరి వద్ద నుంచి రూ.20 వేల నగదు, రెండు సెల్​ఫోన్లు లాక్కొని.. స్కార్పియో వాహనంతో పరారయ్యారు. ఈ మేరకు బాధితుని ఫిర్యాదుతో పోలీసులు కేసు నమోదు చేశారు. జీకేవీధి సీఐ మురళీధర్ సీలేరు, దారకొండ మార్గంలో ఉన్న సీసీ ఫుటేజ్ పరిశీలిస్తున్నారు. ఆరుగురు దొంగల వద్ద మూడు తుపాకులు, నాలుగు కత్తులు ఉన్నాయని ప్రత్యక్ష సాక్షులు తెలిపారు.

నెల క్రితం వరకు వరుస దొంగతనాలతో అప్రమత్తమైన పోలీసులు రాత్రిపూట గస్తీ ఏర్పాటు చేసి దొంగలను పట్టుకునే ప్రయత్నం చేశారు. దీంతో చోరీలకు విరామం ఇచ్చిన దొంగలు మళ్లీ తాజాగా దోపిడీలకు పాల్పడుతున్నారు. దీంతోపాటు వాహనాల్లో ఉన్న వాళ్లపై దాడి చేయడంతో భయాందోళనకు గురవుతున్నారు. పోలీసులు స్పందించి ఈ ముఠాను త్వరగా పట్టుకోవాలని కోరుతున్నారు.

ఇదీ చూడండి :జీవశాస్త్రాల పురోగతికి ఔషధం

ABOUT THE AUTHOR

...view details