ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

విశాఖలో దొంగల ముఠా అరెస్టు - robbery gang arrest news in vizag

విశాఖలో పట్టపగలే చోరీలకు పాల్పడుతోన్న ముఠాను పోలీసులు అరెస్టు చేశారు. నిందితుల నుంచి భారీగా బంగారం, వెండి, నగదు స్వాధీనం చేసుకున్నారు.

విశాఖ పోలీసులకు చిక్కిన పగటి దొంగలు

By

Published : Oct 30, 2019, 1:19 PM IST

విశాఖ పోలీసులకు చిక్కిన పగటి దొంగలు

విశాఖలో పట్ట పగలే దొంగతనాలకు పాల్పడుతూ ప్రజలను భయాందోళనకు గురి చేస్తోన్న ఐదుగురు సభ్యుల ముఠాను పోలీసులు అరెస్టు చేశారు. వీరి వద్ద నుంచి 18.5 తులాల బంగారం, 35 తులాల వెండి, 60 వేల నగదు సహా ఒక చరవాణి స్వాధీనం చేసుకున్నారు. నిందితుల్లో నలుగురు విశాఖకు చెందిన వారు కాగా... మరొకరు వరంగల్​కు చెందిన వారని సీపీ ఆర్కే మీనా తెలిపారు. వీరు గతంలో పది చోరీ కేసుల్లో నిందితులుగా ఉన్నట్లు గుర్తించామని వివరించారు.

ABOUT THE AUTHOR

...view details