విశాఖ జిల్లా చింతపల్లి మండలంలో చెరకుంపాకలు రహదారి మరీ దారుణంగా తయారైంది. ఈ రహదారి రాళ్లు తేలి గిరిజనులకు ప్రత్యక్ష నరకం చూపుతోంది. చింతపల్లి నుంచి చౌడుపల్లి, చెరకుంపాకలు మీదుగా పాడేరు వెళ్లే రహదారి కావడంతో.. నిత్యం వాహనాల రద్దీ ఉంటోంది. సుమారు వంద గ్రామాల ప్రజలకు అనువుగా ఉండే ఈ రహదారి నిర్మాణ బాధ్యత మాది కాదంటూ పంచాయతీ రాజ్, ఆర్‌అండ్‌బీ శాఖలు పట్టించుకోవడం మానేశాయి. విద్యా వనరుల పథకంలో గత ప్రభుత్వ హయాంలో రూ. 2 కోట్లు మంజూరు చేసినా.. పనులు చేపట్టిన గుత్తేదారు మధ్యలో వదిలేశారు. గిరిజన సంక్షేమ శాఖ అధికారులు పనులను పర్యవేక్షించాల్సి ఉన్నా.. పట్టించుకోవడం లేదని స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఏడాదిన్నరగా రాకపోకలు సాగించేందుకు అవస్థలు పడుతున్నామని.. ఎమ్మెల్యే భాగ్యలక్ష్మి, ఐటీడీఏ పీఓ వెంకటేశ్వర్ దృష్టి సారించాలని కోరుతున్నారు.
నిధులున్నా..రోడ్డు వేయట్లేదు - roads damage in chintapalli
రహదారులు ప్రజలకు నరకం చూపిస్తున్నాయి. కాలినడకన వెళ్లే ప్రజలకు రాళ్లు గుచ్చుకుని రక్తాలు కారుతున్నాయి. నిధులు మంజూరైనా రోడ్డేసే నాధుడేలేడు. చింతపల్లి మండలంలో చెరకుంపాకలు రహదారితో ఆ గ్రామ ప్రజలు నిత్యం నరకయాతన అనుభవిస్తున్నారు.
vsp roads
TAGGED:
roads damage in chintapalli