ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

ఫుట్​పాత్​ల తొలగింపు.. దుకాణదారుల ఆందోళన - విశాఖలో రోడ్డు పక్కన ఉన్న దుకాణాల తొలగింపు

విశాఖ మూడోపట్టణ పోలీస్ స్టేషన్ సమీపంలో రోడ్ల పక్కన ఉన్న దుకాణాలను తొలగించాలని జీవీఎంసీ అధికారులు ఆదేశించారు. దుకాణాలు ఉన్న ఫుట్​పాత్​లను జేసీబీతో పగులగొట్టారు. ఉన్నట్లుండి షాపులు తీసేయమంటే తామెలా బతకాలంటూ చిరు వర్తకులు ఆవేదన వ్యక్తం చేశారు.

road side shops collapse in vizag maddilapalem route
దుకాణాలు తీసేయాలంటూ అధికారుల ఆదేశాలు.

By

Published : Jul 9, 2020, 10:26 AM IST

విశాఖ ఆంధ్ర విశ్వవిద్యాలయం నుంచి మద్దిలపాలెం వెళ్లే ప్రధాన రహదారి వెంబడి వ్యాపార దుకాణాలను తొలగించాలని జీవీఎంసీ అధికారులు ఆదేశించారు. దుకాణాలుండే ఫుట్​పాత్​లను జేసీబీతో పగలగొట్టారు. విద్యార్థులకు ఉపయోగపడే పుస్తకాలు, జిరాక్స్ దుకాణాలు, చిన్నచిన్న హోటల్స్, కూల్​డ్రింక్ షాపులు ఇలా అనేకం ఫుట్​పాత్​లపై ఉన్నాయి. వీటిపై ఆధారపడి దాదాపు 20 కుటుంబాలు నివసిస్తున్నాయి. హఠాత్తుగా తమ దుకాణాలు తొలగించమంటే తాము ఎక్కడికి వెళ్లాలని చిరు వ్యాపారులు ఆవేదన వ్యక్తం చేశారు.

నీటిపారుదల శాఖ పరిధిలోని స్థలంలో ఉన్న దుకాణాలను నగరపాలక సంస్థ ఎలా తొలగిస్తుందంటూ తూర్పు ఎమ్మెల్యే వెలగపూడి రామకృష్ణ బాబు ప్రశ్నించారు. రాజకీయ ఒత్తిళ్లతోనే అధికారులు ఇలా చేస్తున్నారని ఆరోపించారు. దీనిపై అధికారులు పునరాలోచించాలని లేదంటే ధర్నా చేస్తామని హెచ్చరించారు.

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details