ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

రహదారే ప్రసూతి కేంద్రం... అయినా దక్కని ప్రాణం! - సరైన వసతులు లేక

తొమ్మిది నెలలు మోసింది. బిడ్డను కళ్లరా చూసుకోవాలనుకుంది. కానీ ఆ తల్లికి కడుపుకోతే మిగిలింది. విశాఖ ఏజెన్సీలో రవాణా సౌకర్యం లేక ఓ తల్లి రోడ్డుపైనే ప్రసవించి...పురిటిలోనే బిడ్డను కోల్పోయింది.

రహదారే ప్రసూతి కేంద్రం... అయినా దక్కని ప్రాణం

By

Published : Sep 14, 2019, 9:04 PM IST

Updated : Sep 14, 2019, 10:36 PM IST

విశాఖ ఏజెన్సీలో గర్భిణులను కష్టాలు వెంటాడుతున్నాయ్. శిశు మరణాల రేటును తగ్గించాలని ఓ వైపు ప్రణాళికలు వేసుకుంటున్నా..ఆ దుస్థితి ఆగట్లేదు. విశాఖ ఏజెన్సీలో... ఎప్పుడూ ఇలాంటి కన్నీరు పెట్టించే కథలే. కంటి ముందు నిర్జీవంగా ఉన్న బిడ్డను చూసి ఏమి చేయాలో తెలియక తనలో తానే కుమిలిపోతున్న గిరిపుత్రులు చాలామందే ఉన్నారు. తాజాగా అలాంటి ఘటనే జరిగింది. పాడేరు మండలం వై. సంపల గ్రామానికి చెందిన నిండు గర్భిణీ ప్రసవంలోనే బిడ్డను పోగొట్టుకుంది. అడుగుతీసి అడుగు వేయలేని స్థితిలో ఉన్న ఆమెకు రహదారే ప్రసూతి కేంద్రం అయ్యింది. ఆసుపత్రికి తీసుకెళ్తుంటే..ఆమెకు నొప్పులు ఎక్కువయ్యాయి. కదిలించే వీలు లేక ఆశావర్కర్లు రోడ్డుపైనే ప్రసవం చేశారు. అమ్మ ఒడికి చేరాల్సిన బిడ్డ మృత్యువు ఒడికి చేరింది. ఇంకా కళ్లు తెరవని పసిగుడ్డును బతికించేందుకు చేసిన ప్రయత్నాలు విఫలమయ్యయి. ఫలితం తల్లికి కడుపుకోత మిగిలింది.

రహదారే ప్రసూతి కేంద్రం... అయినా దక్కని ప్రాణం
Last Updated : Sep 14, 2019, 10:36 PM IST

ABOUT THE AUTHOR

...view details