విశాఖ జిల్లా తగరపువలస జాతీయ రహదారిపై కారు ఢీకొని.. ఓ పాదచారుడు మృతి చెందాడు. ఈ ఘటనలో తూర్పుగోదావరి జిల్లా తుని మండలం తిమ్మాపురం గ్రామానికి చెందిన పొలనాటి అప్పారావు అనే వ్యక్తి మరణించాడు.
మృతుడు సంగివలస పోలమాంబ దేవాలయంలో దర్శనం చేసుకుని రహదారిని దాడుతుండగా.. శ్రీకాకుళం నుంచి విశాఖ వెళ్తున్న కారు బలంగా ఢీకొట్టింది. తీవ్రగాయాల పాలైన అతడిని ఆసుపత్రిలో చేర్చగా.. చికిత్స పొందుతూ మృతి చెందాడు. భీమునిపట్నం పోలీసులు కేసునమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.