మన్యం ఘాట్‌రోడ్‌లో బియ్యం లారీ బోల్తా
మన్యం ఘాట్‌రోడ్‌లో బియ్యం లారీ బోల్తా - road accident in vishaka manyam latest
విశాఖ మన్యం ఘాట్‌రోడ్‌లో.. బియ్యం లారీ బోల్తా పడింది. పాడేరు మండలం మినుములూరు వద్ద ఘాట్ రోడ్డు మలుపులో.... అదుపుతప్పి బోల్తా పడింది. బియ్యం టిక్కీలు పక్కనున్న పొలాల్లో పడ్డాయి. క్యాబిన్‌లో చిక్కుకున్న డ్రైవర్‌ను బయటకు తీశారు. అతను స్వల్పగాయాలతో బయటపడ్డాడు. లారీ తూర్పు గోదావరి జిల్లా పెద్దాపురం నుంచి పాడేరు వెళ్తుండగా ప్రమాదం జరిగింది.
![మన్యం ఘాట్‌రోడ్‌లో బియ్యం లారీ బోల్తా road-accident-in-vishaka-manyam](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-6377590-thumbnail-3x2-vsp.jpg)
road-accident-in-vishaka-manyam