తాండవ నది వంతెన వద్ద రోడ్డు ప్రమాదం.. ఒకరు మృతి - road accident in payakaraopeta
విశాఖ జిల్లా పాయకరావుపేట తాండవ నది వంతెన జాతీయ రహదారిపై గుర్తు తెలియని వాహనం ఢీకొని ఓ వ్యక్తి అక్కడికక్కడే మృతి చెందాడు. మృతుడు పట్టణంలోని దుర్గాకాలనీకి చెందిన బండారు ధనుంజయ్(50)గా గుర్తించారు. విశాఖ నుంచి తుని వైపు వెళ్తున్న గుర్తు తెలియని వాహనం ఢీకొట్టింది. ఘటనపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ప్రమాదం కారణంగా ట్రాఫిక్కు అంతరాయం కలిగింది.
తాండవ నది వంతెన వద్ద రోడ్డు ప్రమాదం