ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

విశాఖ జిల్లాలో టూరిస్ట్​ బస్సు బోల్తా... ముగ్గురు మృతి - paderu ghat road

విశాఖ జిల్లా వంటలమామిడి ఘాట్‌రోడ్డులో రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో ముగ్గురు మహిళలు మృతిచెందగా... 37 మంది గాయపడ్డారు.

విశాఖ జిల్లాలో రోడ్డు ప్రమాదం

By

Published : Jul 9, 2019, 6:14 AM IST

విశాఖ జిల్లాలో రోడ్డు ప్రమాదం

విశాఖ జిల్లా పాడేరు మండలం వంటలమామిడి ఘాట్‌రోడ్డులో రోడ్డు ప్రమాదం జరిగింది. ప్రైవేట్‌ టూరిస్ట్‌ బస్సు అదుపుతప్పి బోల్తా పడింది. ఈ ప్రమాదంలో ముగ్గురు మహిళలు మృతి చెందారు. మరో 37 మంది ప్రయాణికులకు గాయాలయ్యాయి. అర్ధరాత్రి 12.30 గంటల సమయంలో ఈ ప్రమాదం జరిగింది. బాధితుల సహాయక చర్యలు అందక వర్షంలో 3గంటలపాటు అవస్థలు పడ్డారు. క్షతగాత్రులను అనకాపల్లి ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. బాధితులంతా తూర్పుగోదావరి జిల్లా కాకినాడ వాసులుగా గుర్తించారు. ఒడిశా రాష్ట్రం రాయగఢ్‌లోని మజ్జిగైరమ్మ అమ్మవారి దర్శనానికి వెళ్లి... తిరిగి వస్తుండగా ఈ ప్రమాదం జరిగింది.

ABOUT THE AUTHOR

...view details