విశాఖ జిల్లా రోలుగుంట మండలం బుచ్చింపేట వద్ద ఆటో బోల్తా పడిన ఘటనలో నలుగురు తీవ్రంగా గాయపడ్డారు. వీరిలో ఇద్దరి పరిస్థితి ఆందోళనకరంగా ఉంది. విశాఖ కేజీహెచ్‌కు తరలించారు.
రోలుగుంట మండలం రత్నం పేట గ్రామానికి చెందిన బుద్ధి రెడ్ల మౌనిక, ఆమె స్నేహితురాలు ఇదే మండలం కొంతలం గ్రామానికి చెందిన ప్రవల్లిక.. ఇద్దరూ నర్సీపట్నంలో డిగ్రీ పరీక్షలు రాయడానికి ఆటోలో బయలుదేరారు.