విశాఖ జిల్లా పాడేరు ఘాట్ రోడ్లోని కాశీపురం వద్ద కారు అపసవ్య దిశలో వచ్చి ద్విచక్ర వాహనాన్ని ఢీ కొట్టింది. ద్విచక్ర వాహనం నడుపుతున్న యువకుడి కాలు విరిగిపోయి కారు చక్రం భాగంలో చిక్కుకుంది. విరిగిపోయిన కాలితోనే బంధువులకు సమాచారం అందించాడు. అంబులెన్స్ లో మాడుగుల ఆసుపత్రికి యువకుడిని తరలించారు. కారు డ్రైవర్ రాంగ్ రూట్ లో వచ్చాడని.. అందుకే ప్రమాదం జరిగిందని స్థానికులు చెబుతున్నారు. యువకుడు శ్రీను స్వగ్రామం పాడేరు మండలం గుంజువాడ గ్రామం. మాడుగుల పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
ద్విచక్ర వాహనాన్ని ఢీకొట్టిన కారు..యువకుడికి తీవ్రగాయాలు - పాడేరులో రోడ్డు ప్రమాదం
విశాఖ పాడేరు ఘాట్ రోడ్డు వద్ద ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో ఓ యువకుడి కుడి కాలు విరిగి కారులో చిక్కుకుపోయింది. కారు నడుపుతున్న వ్యక్తి రాంగ్ రూట్ లో వచ్చి ద్విచక్రవాహనాన్నిఢీకొనడం వల్లే ప్రమాదం జరిగిందని స్థానికులు చెబుతున్నారు.
road accident