ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

ACCIDENT: బైక్​ను ఢీకొట్టిన కారు.. భర్త మృతి, భార్యకు గాయాలు - crime news

విశాఖ జిల్లా కొక్కిరాపల్లి వద్ద జాతీయ రహదారిపై రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. ఈ ఘటనలో ఒకరు మృతి చెందగా.. మరొకరికి తీవ్ర గాయాలయ్యాయి. ప్రమాదానికి అధిక వేగమే కారణమని మృతుని కుటుంబసభ్యులు ఆరోపిస్తున్నారు.

ACCIDENT
కొక్కిరాపల్లి వద్ద రోడ్డు ప్రమాదం

By

Published : Jul 14, 2021, 10:44 PM IST

విశాఖ జిల్లా యలమంచిలి మండలం కొక్కిరాపల్లి వద్ద జాతీయ రహదారిపై రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో ఒకరు మృతి చెందారు. జిల్లాలోని అనకాపల్లికి చెందిన షేక్ నాగూర్, షేక్ మున్ని దంపతులు ద్విచక్రవాహనంపై కొక్కిరాపల్లి బయలుదేరారు. రహదారిపై రోడ్డు దాటుతుండగా.. ఎలమంచిలి నుంచి విశాఖ వైపు ప్రయాణిస్తున్న ఓ కారు వీరిని వేగంగా వచ్చి ఢీ కొట్టింది.

ఈ ప్రమాదంలో షేక్ నాగూర్ మృతిచెందగా.. అతని భార్య మున్ని తీవ్రంగా గాయపడింది. వీరిని అనకాపల్లి ఆస్పత్రికి తరలించారు. కారు మితిమీరిన వేగంతో ప్రయాణించడం వల్లే దుర్ఘటన చోటు చేసుకుందని మృతుని కుటుంబసభ్యులు ఆందోళన వ్యక్తం చేశారు. దీనిపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

ABOUT THE AUTHOR

...view details