ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

పొట్టకూటికి పయనమై.. రోడ్డు ప్రమాదంలో మృతి! - latest news in anakapalli

బతుకుదెరువు కోసం బయలుదేరిన ఇద్దరు వ్యక్తులను మృత్యువు కబళించింది. విశాఖ జిల్లా అనకాపల్లి మండలం తుమ్మపాల వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో వారిరువురూ మరణించారు.

road accident
రోడ్డు ప్రమాదం

By

Published : Jun 15, 2021, 9:41 AM IST

Updated : Jun 15, 2021, 10:40 AM IST

పొట్టకూటికి పయనమైన ఇద్దరు వ్యక్తులు రోడ్డు ప్రమాదంలో మృతి చెందారు. తూర్పు గోదావరి జిల్లా కాట్రేనికోన మండలం పల్లంగ్రామానికి చెందిన పి. నరసింహమూర్తి (25), యానాంకు చెందిన ప్రసాద్ (26) అనే వ్యక్తులు.. అనకాపల్లి మండలం మాక వరం గ్రామానికి చెందిన అప్పారావు వద్ద లైటింగ్ పని చేసేవారు.

ఈ క్రమంలో సొంత ఊరు నుంచి పనుల నిమిత్తం ద్విచక్రవాహనంపై బయలుదేరారు. అనకాపల్లి మండలం తుమ్మపాల వద్ద ఎదురుగా వస్తున్న బైక్ ను తప్పించబోయి.. దాని పక్కనే వస్తున్న ప్రైవేట్ బస్సును ఢీకొట్టారు. తీవ్ర గాయాలపాలైన ఇద్దరూ అక్కడికక్కడే మృతి చెందారు. పోలీసులు ఘటనాస్థలిని చేరుకొని కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

Last Updated : Jun 15, 2021, 10:40 AM IST

ABOUT THE AUTHOR

...view details