విశాఖ జిల్లా నర్సీపట్నం మండలం బలిఘట్టం వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో వృద్ధుడు మృతి చెందగా మరొక్కరికి గాయాలయ్యాయి. గురైందొరపాలెం గ్రామానికి చెందిన ముమ్మన తతబ్బాయి, రత్నంపేట గ్రామానికి చెందిన చిరంజీవి ద్విచక్ర వాహనంపై వేములపూడి వెళుతుండగా బలిఘట్టం వద్ద తుని వైపు వెళుతున్న లారీ ఢీకొనడంతో తాతబ్బాయి చనిపోయాడు. గాయపడిన చిరంజీవిని 108 వాహనంపై ఆసుపత్రికి తరలించారు.
ద్విచక్రవాహనాన్ని ఢీ కొట్టిన లారీ... ఒకరు మృతి... - బలిఘట్టం
విశాఖజిల్లా బలిఘట్టం వద్ద రోడ్డు ప్రమాదం జరిగింది. ద్విచక్ర వాహనంపై వెళ్తున్న ఇద్దరు వ్యక్తులను లారీ ఢీ కొట్టడంతో ఒకరు అక్కడే మృతి చెందగా, మరొక్కరికి గాయాలయ్యాయి.
బలిఘట్టం వద్ద రోడ్డు ప్రమాదం