విశాఖ జిల్లా ఆనందపురం జాతీయ రహదారిపై ప్రమాదం జరిగింది. లారీ కిందికి ద్విచక్రవాహనం దూసుకెళ్లింది. బైక్పై ప్రయాణిస్తున్న వారిలో వెనుక కూర్చున్న సింగురి దశరథ్ (40) అక్కడికక్కడే మరణించాడు. ద్విచక్రవాహనం నడుపుతున్న మెట్ల చిరంజీవి (35) తీవ్రంగా గాయపడ్డాడు.
చిరంజీవిని చికిత్స నిమిత్తం సమీపంలోని ప్రభుత్వాస్పత్రికి స్థానికులు తరలించారు. ఇద్దరూ.. శ్రీకాకుళం జిల్లా జలుమూరు మండలం ఎర్రన్నపేట గ్రామానికి చెందిన వారుగా పోలీసులు గుర్తించారు. ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు.