ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

స్టీల్ ప్లాంట్: 97వ రోజుకు చేరిన రిలే నిరాహార దీక్షలు - visakha steel plant protest

విశాఖపట్నంలో స్టీల్ ప్లాంట్ రిలే నిరహార దీక్షలు 97వ రోజుకు చేరుకున్నాయి. దేశ ఆర్థిక పరిస్థితిని చక్కదిద్దే ప్రభుత్వరంగ పరిశ్రమల అమ్మకాలపై ప్రధాని మొండిగా వ్యవహరిస్తున్నారని ఉక్కు పోరాట కమిటీ సభ్యలు విమర్శించారు.

steel plant
97వ రోజుకు చేరిన రిలే నిరాహార దిక్షలు

By

Published : May 19, 2021, 6:42 PM IST

విశాఖ ఉక్కు పరిరక్షణ పోరాట కమిటీ ఆధ్వర్యంలో స్టీల్ ప్లాంట్ ఆర్చి వద్ద 97వ రోజు రిలే నిరాహార దీక్షలు కొనసాగాయి. విశాఖ స్టీల్ ప్లాంట్ నుంచి ఎల్ఎంఎంఎం, ఆర్ఎస్,ఆర్ఎస్ విభాగాల కార్యదర్శులు, కార్యకర్తలు పాల్గొన్నారు. దేశ ఆర్థిక పరిస్థితిని చక్కదిద్దే ప్రభుత్వరంగ పరిశ్రమల అమ్మకాలపై ప్రధాని మొండిగా వ్యవహరిస్తున్నారని ఉక్కు పోరాట కమిటీ సభ్యలు అన్నారు. దీనిపై ప్రధానికి లేఖ రాసినప్పటికీ స్పందించలేదన్నారు. విశాఖ ఉక్కులోను అలాగే సెయిల్​లో కొవిడ్​తో మరణించిన కార్మికుల కుటుంబాలను ఆదుకోవాలని డిమాండ్ చేశారు.

ABOUT THE AUTHOR

...view details