పౌరసత్వ చట్ట సవరణ బిల్లు 2019 కు వ్యతిరేకంగా వైజాగ్ జర్నలిస్ట్స్ ఫోరం ప్రెస్‌క్లబ్‌లో ముస్లిం, ప్రజా, హక్కుల సంఘాల ప్రతినిధులు సమావేశం నిర్వహించారు. ఈ బిల్లు చట్టమైతే దేశంలోని ముస్లింల మనుగడకు ముప్పు వాటిల్లుతుందని వక్తలు తెలిపారు. అవసరమైతే దేశ అత్యున్నత న్యాయస్థానంలో న్యాయ పోరాటానికి సిద్ధపడతామని ముస్లిం న్యాయవాదులు స్పష్టం చేశారు. దేశ సంపద, స్వాతంత్రోద్యమంలోనూ ప్రముఖ పాత్ర వహించిన భారతీయ ముస్లిం సమాజాన్ని వేరుపరిచే ఈ బిల్లు.. రాజ్యాంగ మూల సూత్రాలకు, సమానత్వ హక్కుకు వ్యతిరేకమని హక్కుల సంఘాల ప్రతినిధులు స్పష్టం చేశారు. ఇప్పటికే అంతర్జాతీయ సమాజం ఈ బిల్లుపై వ్యతిరేకతను వ్యక్తం చేస్తోందన్నారు. అనేక అంతర్జాతీయ ఒప్పందాలకు ఈ బిల్లు విరుద్ధమని అభివర్ణించారు.
'పౌరసత్వ చట్ట సవరణ బిల్లు రాజ్యంగ విరుద్ధం' - Citizenship Law Amendment Bill latest news in telugu
పౌరసత్వ చట్ట సవరణ బిల్లు 2019 రాజ్యాంగ విరుద్ధమని ముస్లిం, ప్రజా, హక్కుల సంఘాల ప్రతినిధులు ఆందోళన వ్యక్తం చేశారు. వైజాగ్ జర్నలిస్ట్స్ ఫోరం ప్రెస్‌క్లబ్‌లో ఏర్పాటు చేసిన సమావేశంలో ప్రజా సంఘాల ప్రతినిధులు ఈ బిల్లుపై వ్యతిరేకతను వ్యక్తపరిచారు.
rights groups voice against citizenship law amendment bill in visakhapatnam