విశాఖ జిల్లా మాడుగుల మండలంలో నాటుసారా తయారీ కేంద్రాలపై ఆబ్కారీ శాఖ పోలీసులు దాడులు జరిపారు. ఒమ్మలి జగన్నాథపురం ప్రాంతంలో దాడులు నిర్వహించారు. నాటుసారా తయారికి ఉపయోగించే 1,400 లీటర్ల బెల్లం ఊట గుర్తించి, ధ్వంసం చేసినట్లు మాడుగుల ఆబ్కారీ శాఖ సీఐ జగదీశ్వరరావు వెల్లడించారు. నాటుసారా తయారు చేస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.
నాటుసారా తయారీ కేంద్రాలపై వరస దాడులు - rides on natu sara manufacturing
నాటుసారా తయారీ కేంద్రాలపై విశాఖ జిల్లా మాడుగుల మండలంలో ఆబ్కారీ శాఖ వరస దాడులు చేస్తున్నారు. తాజాగా ఒమ్మలి జగన్నాథపురం ప్రాంతంలో నాటుసారా తయారికి ఉపయోగించే బెల్లం ఊటను గుర్తించి ధ్వంసం చేశారు.
![నాటుసారా తయారీ కేంద్రాలపై వరస దాడులు rides on natu sara manufacturing](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-8771180-1081-8771180-1599883350814.jpg)
నాటు సారా తయారీ స్థావరాలపై దాడులు