విశాఖ జిల్లా రావికమతం మండలంలోని తోటకూరపాలెం, గొంప తదితర ప్రాంతాల్లోని నాటుసారా తయారీ స్థావరాలపై రావికమతం పోలీసులు దాడులు నిర్వహించారు. ఈ దాడుల్లో భాగంగా 40 లీటర్ల సారా స్వాధీనం చేసుకొని 500 లీటర్ల బెల్లం ఊటను ధ్వంసం చేశారు. ముగ్గురిపై కేసులు నమోదు చేసినట్లు ఎస్సై సూర్యనారాయణ తెలిపారు. జిల్లా ఎస్పీ ఆదేశాల మేరకు నాటుసారా తయారీ, విక్రయ కేంద్రాలపై దాడులు చేసినట్లు ఎస్సై వివరించారు. గ్రామాల్లో నాటుసారా తయారీకి సంబంధించి ఎలాంటి సమాచారం తమకు ఇవ్వాలని స్థానికులకు సూచించారు.
నాటుసారా స్థావరాలపై దాడులు.. 40 లీటర్ల గుడుంబా పట్టివేత - విశాఖ జిల్లా తాజా వార్తలు
విశాఖ జిల్లా రావికమతం మండలంలోని నాటుసారా స్థావరాలపై స్థానిక పోలీసులు దాడులు చేశారు. 40 లీటర్ల సారా స్వాధీనం చేసుకొని పులువురిపై కేసు నమోదు చేసినట్లు అధికారులు వెల్లడించారు.
ride on Natu Sara manufacturing centers at ravikamatham