విశాఖ జిల్లా నర్సీపట్నం సబ్ డివిజన్ పరిధిలో వివిధ శాఖల అధికారులు పర్యటించారు. నాతవరం నర్సీపట్నం , గొలుగొండ , మాకవరపాలెం , తదితర ప్రాంతాల్లోని ఇసుక సేకరణ రీచ్‌లను వారు పరిశీలించారు. ప్రభుత్వ పరంగా చేపడుతున్న నిర్మాణాలకు సంబంధించి అవసరమైన అనుమతులు తీసుకోవాలని సూచించారు.
'అనుమతులు ఉంటేనే ఇసుకను తీసుకెళ్లాలి' - నర్సీపట్నం సబ్ డివిజన్ ఇసుక రీచ్‌లు వార్తలు
విశాఖ జిల్లా నర్సీపట్నం సబ్ డివిజన్ పరిధిలో ఇసుక రీచ్‌లను పోలీసులు, ఆయా శాఖల అధికారులు పరిశీలించారు. అనుమతులు తీసుకుని మాత్రమే ఇసుకను తీసుకెళ్లాలని స్ఖానికులకు వారు సూచించారు.
నర్సీపట్నం సబ్ డివిజన్ ఇసుక రీచ్‌లు
ఇటీవల కురిసిన వర్షాలకు రీచ్‌లలో ఇసుక లభ్యత.. వాటి తవ్వకాలపై ఆరా తీశారు. ఇందుకు సంబంధించి మండల తహసీల్దార్ కార్యాలయంలో అనుమతులకోసం ఎలాంటి నిబంధనలు పాటించాలి అనే అంశాలపై మార్గదర్శకాలను జారీ చేశామన్నారు.