కరోనా లాక్డౌన్ ప్రారంభమయిన తరువాత విశాఖలో భూగర్భ విద్యుత్ కేబుల్ పనులు పూర్తిగా నిలిచిపోయాయి. కర్ఫ్యూను విశాఖలో కట్టుదిట్టం చేసిన కారణంగా.. ప్రభుత్వం ఎలాంటి పనులకు అనుమతినివ్వలేదు. విశాఖలో విద్యుత్ సరఫరాకు అంతరాయం కలిగించే లోడ్ లోపాలను సరిచేసేందుకు.. ఆ నిబంధనలను కాస్త సడలించారు. లాక్డౌన్ ఉన్నా... ప్రస్తుతం పనులను కొనసాగిస్తున్నారు. కార్మికులకు కరోనా సోకకుండా.. అన్ని చర్యలను తీసుకుంటున్నారు.
విశాఖలో భూగర్భ విద్యుత్ పనులు పునఃప్రారంభం - విశాఖలో కరోనా వార్తలు
విశాఖలో కరోనా లాక్ డౌన్ కారణంగా నిలిచిపోయిన భూగర్భ విద్యుత్ కేబుల్ పనులను.. అధికారులు మళ్లీ కొనసాగిస్తున్నారు. కార్మికులకు ఇబ్బంది రాకుండా అన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నారు.
Resumption of underground electrical works in Visakha