ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

విశాఖలో మద్యం విక్రయాలపై ఆంక్షలు.. పాటించకుంటే కఠిన చర్యలు - విశాఖలో మద్యం వార్తలు

విశాఖ అధికారులు మద్యం దుకాణాలపై ఆంక్షలు విధించారు. పుర ఎన్నికల నేపథ్యంలో నిబంధనలు విధిస్తూ ఉత్తర్వులు జారీచేశారు. ఒక్కొక్కరికి ఎన్ని మద్యం సీసాలు అమ్మాలో అందులో పేర్కొన్నారు. పాటించని వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.

Restrictions on liquor
మద్యం విక్రయాలపై ఆంక్షలు

By

Published : Feb 23, 2021, 3:21 PM IST

పుర ఎన్నికల సందర్భంగా విశాఖలో అధికారులు మద్యం అమ్మకాలపై పరిమితిని విధించారు. మద్యం దుకాణాల ఎదుట బోర్డులు పెట్టాలని ఉత్తర్వులు జారీచేశారు. ఒక్కరికి రూ.250 ధర పైబడిన మద్యం సీసాలను మూడు మాత్రమే విక్రయించాలని నిర్దేశించారు. రూ.200 ధరకు దిగువనున్న మద్యం సీసాలను ఒకరికి.. ఒక్కటి మాత్రమే అమ్మాలని స్పష్టం చేశారు. 750, 650 ఎంఎల్​ ఉన్న బీర్​సీసాలను ఒకరికి.. ఒక్కటి మాత్రమే విక్రయించాలని ఉత్తర్వులో పేర్కొన్నారు. నిబంధనలు పాటించని మద్యం దుకాణాలపై కఠిన చర్యలు తీసుకుంటామని ఎపీఎస్​బీసీఎల్ విశాఖ డిపో మేనేజర్ వెల్లడించారు.

ABOUT THE AUTHOR

...view details