ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

పునరుద్ధరించిన ఆర్పీఎఫ్​ పోలీసుల బ్యారక్​ ప్రారంభం - rpf at visakhapatnam latest news update

ఆర్పీఎఫ్​ పోలీసుల బ్యారక్​ను ఆధునిక వసతులతో పునరుద్ధరించినట్లు వాల్తేరు​ సీనియర్​ డివిజనల్​ సెక్యూరిటీ కమిషనర్​ జితేంధ్ర శ్రీవాస్తవ తెలిపారు. వీటిలో ఆధునిక వంట గదితోపాటు టెబుల్‌ టెన్నిస్‌, మినీ క్రీడా ప్రాంగణం, బ్యాడ్మింటన్‌ కోర్టు, ఫుట్‌ మసాజర్‌, సైక్లింగ్‌, జిమ్‌ సౌకర్యాలు అందుబాటులోకి తీసుకొచ్చినట్లు వెల్లడించారు.

Breaking News

By

Published : Jul 27, 2020, 12:32 AM IST

విశాఖ జిల్లా తూర్పు కోస్తా రైల్వే వాల్తేర్‌ డివిజన్‌ మర్రిపాలెంలో ఆర్పీఎఫ్‌ పోలీసుల కోసం ఆధునిక వసతులతో కూడిన బ్యారక్‌ను పునరుద్ధరించినట్లు వాల్తేరు సీనియర్‌ డివిజనల్‌ సెక్యూరిటీ కమిషనర్‌ జితేంద్ర శ్రీవాస్తవ తెలిపారు. బ్యారక్​లో ఏర్పాటు చేసిన వసతుల్ని డీఆర్‌ఎం చేతన్‌కుమార్‌, శ్రీవాస్తవ వీడియో కనెక్టివిటీ ద్వారా పరిశీలించారన్నారు. రూ.35 లక్షలతో ఆరు నెలల్లో బ్యారక్‌ను అభివృద్ధి చేసినట్లు వెల్లడించారు. ఆధునిక వంట గదితోపాటు టెబుల్‌ టెన్నిస్‌, మినీ క్రీడా ప్రాంగణం, బ్యాడ్మింటన్‌ కోర్టు, ఫుట్‌ మసాజర్‌, సైక్లింగ్‌, జిమ్‌ సౌకర్యాలు అందుబాటులోకి తీసుకొచ్చినట్లు తెలిపారు.

ABOUT THE AUTHOR

...view details