విశాఖ జిల్లా దేవరాపల్లి మండలం ఎం.అలమండ ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం యూరియా కోసం రైతుల ఇబ్బందులను ఈటీవీ, ఈటీవీ భారత్లో కథనాలకు వ్యవసాయ శాఖ జేడీ లీలావతి స్పందించారు. దేవరాపల్లి మండలంలోని ఎం.అలమండ, ములకలాపల్లి సొసైటీలను జేడీ తనిఖీ చేశారు. యూరియా ఎంత మేరకు విక్రయించారు..? ఎంత మేరకు నిల్వ ఉందని.. ? రికార్డులు పరిశీలించారు. మండల వ్యవసాయ అధికారి సృజన, సొసైటీ సిబ్బందితో ఆమె సమావేశం నిర్వహించారు.
ఈటీవీ భారత్ కథనానికి స్పందన.. యూరియా కొరతపై అధికారులు ఆరా - విశాాఖపట్నంలో యూరియా కొరత
విశాఖ జిల్లా ఎం.అలమండ సొసైటీ వద్ద ఎరువుల కోసం రైతుల ఇబ్బందులపై ఈటీవీ, ఈటీవీ భారత్ లో కథనాలకు వ్యవసాయ శాఖ జేడీ స్పందించారు. రైతులకు ఎరువుల కొరత లేకుండా పూర్తి స్థాయిలో అందుబాటులో ఉంచుతామని జేడీ చెప్పారు.
![ఈటీవీ భారత్ కథనానికి స్పందన.. యూరియా కొరతపై అధికారులు ఆరా response to etv bharat story on scarcity on urea in vishakadistrict](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-8674318-39-8674318-1599202896316.jpg)
కలిగొట్ల, ములకలాపల్లి సొసైటీల్లో 25 టన్నుల చొప్పున యూరియా విక్రయించేందుకు సిద్ధంగా ఉందన్నారు. దేవరాపల్లి, కలిగొట్ల, ఎం.అలమండ, ములకలాపల్లి వ్యవసాయ సహకార సంఘాల నుంచి 671 టన్నులు, ప్రైవేటు దుకాణాలు నుంచి 225 టన్నుల ఎరువులను రైతులకు సరఫరా చేశామన్నారు. ఎకరాకు 20 కేజీల యూరియా మాత్రమే వేయాలని శాస్త్రవేత్తలు చెబుతున్నారన్నారు. రైతులు యూరియా కోసం ఆందోళన వద్దని, పూర్తి స్థాయిలో సరఫరా చేస్తామని జేడీ పేర్కొన్నారు. అనంతరం రైతు భరోసా కేంద్రాలను పరిశీలించారు
ఇదీ చదవండి: కుక్కల బాధ భరించలేక పోలీస్స్టేషన్ మెట్లెక్కిన మహిళలు