ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

ఈటీవీ భారత్ కథనానికి స్పందన.. తీరిన యూరియా కొరత - రోలుగుంటలో యూరియా కొరత

విశాఖ జిల్లా రోలుగుంటలో ఎరువుల కొరత ఈనాడు- ఈటీవీ భారత్ కథనానికి అధికారులు స్పందించారు. అదనంగా 50 టన్నుల ఎరువులను రప్పించారు.

response on etv bharat story on scarcity on urea at rolugunta
తీరిన యూరియా కొరత

By

Published : Sep 12, 2020, 12:32 PM IST

విశాఖ జిల్లా రోలుగుంట పీఏసీఎస్‌ ద్వారా రైతులకు ఎరువుల కొరత తీర్చేందుకు ఎట్టకేలకు వ్యవసాయ శాఖతోపాటు సహకార సిబ్బంది చర్యలు చేపట్టారు. రైతులకు అవసరమైన ఎరువులను అందించేందుకు సన్నాహాలు చేశారు. రోలుగుంట మండలానికి సంబంధించి సుమారు 24 పంచాయతీలకు చెందిన రైతులకు సొసైటీ ద్వారా ఎరువులను విక్రయిస్తుంటారు.

ఈ ఏడాదికి సాగు విస్తీర్ణం పెరిగింది. ఈ నేపథ్యంలో రైతులకు సుమారు 200 టన్నులకు పైగా ఎరువులు అవసరమని అంచనా. ఈనెల 5వ తేదీ వరకూ సుమారు 125 టన్నుల ఎరువులు విక్రయించారు. అధికారులు ఎరువుల కొరత లేదని చెబుతున్నా పరిస్థితులు భిన్నంగా ఉన్నాయి. సొసైటీ వద్ద తెల్లవారుజాము నుంచే నిరీక్షిస్తేనే ఒక బస్తా ఎరువు దొరకడం గగనమైపోయింది. ఈ పరిస్థితులపై ఈనాడు- ఈటీవీ భారత్ కథనాలపై మండల వ్యవసాయశాఖ, సొసైటీ అధికారులు స్పందించి అదనంగా 50 టన్నుల ఎరువులను రప్పించారు. సొసైటీ ద్వారా ఇప్పటివరకూ 177 టన్నుల ఎరువులను విక్రయించినట్టు సొసైటీ అధ్యక్షులు చెట్టుపల్లి వెంకటరావు ‘ తెలిపారు.

ఇదీ చదవండి: పబ్జీ‌ ఆటకు బానిసై బీటెక్ విద్యార్థి ఆత్మహత్య

ABOUT THE AUTHOR

...view details