ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

ఈటీవీ భారత్​ కథనానికి స్పందన... ఏటికొప్పాక కళాకారులకు సాయం - lock down effect on etikoppaka

ఏటికొప్పాక కళాకారుల దయనీయ దుస్థితికి చలించిన విశాఖకు చెందిన సింబయాసిస్ కంపెనీ సీఈవో నరేశ్​కుమార్ స్పందించారు. ఆ కుటుంబాలకు నిత్యావసర వస్తువులు పంపిణీ చేయటమే కాకుండా, వారి నుంచి 12 వేల విలువైన లక్క బొమ్మలను కొనుగోలు చేశారు.

response for etv bharat story on etikoppaka handlooms
ఏటికొప్పాక కళాకారుల కష్టాలపై స్పందించిన సింబయాసిస్ కంపెనీ సీఈవో

By

Published : May 21, 2020, 7:12 PM IST

ఏటికొప్పాక కళాకారుల కష్టాలపై స్పందించిన సింబయాసిస్ కంపెనీ సీఈవో

లాక్‌డౌన్‌తో పూట గడవడమే కష్టంగా మారిన ఏటికొప్పాక కళాకారుల దుస్థితిపై ఈటీవీ భారత్​లో వచ్చిన'లక్కబొమ్మల గ్రామం వెలవెలబోతోంది' కథనానికి స్పందించారు. బొమ్మల తయారీనే వృత్తిగా నమ్ముకున్న కళాకారులను ఆదుకునేందుకు విశాఖకు చెందిన సింబయాసిస్ కంపెనీ సీఈవో నరేశ్‌కుమార్‌ ముందుకొచ్చారు. 130 పేద కుటుంబాలకు 10 రోజులకు సరిపడ నిత్యవసరాలను పంపిణీ చేశారు. కళాకారుల నుంచి 12 వేల రూపాయలు విలువ చేసే లక్క బొమ్మలను కొనుగోలు చేశారు. ఆ బొమ్మలను తన స్నేహితులకు చూపించి, కళాకారుల నుంచి కొనుగోలు చేయించేందుకు తన వంతు ప్రయత్నం చేస్తానంటున్నాడీ దాత.

ABOUT THE AUTHOR

...view details