ఆంధ్రప్రదేశ్

andhra pradesh

By

Published : Nov 21, 2019, 4:46 PM IST

ETV Bharat / state

'ఈటీవీభారత్' కథనానికి స్పందన... అరుణను కలిసిన మణికుమారి

ఎనిమిది నెలల గర్భిణీ అయినా... 5 కిలోమీటర్లు ఘాట్​ రోడ్డులో నడిచి... పూలు అమ్ముకుంటున్న అరుణపై 'ఈటీవీభారత్'​లో కథనం ప్రచురితమైంది. ఈ కథనానికి స్పందించిన రాష్ట్ర మహిళా కమిషన్ సభ్యురాలు మణికుమారి గర్భిణీ అరుణను కలిశారు.

ఈటీవీ భారత్ కథనానికి స్పందన

ఈటీవీ భారత్ కథనానికి స్పందన

ఎనిమిది నెలల గర్భిణీ అయినా... పేదరికంతో 5 కిలోమీటర్ల దూరం నడిచి రైతు బజార్లో పూలు అమ్ముకుంటోంది అరుణ. అరుణ పరిస్థితిపై 'ఈటీవీభారత్'​లో "8 నెలల గర్భిణీ... 15 కిలోల బరువు... 5 కిలోమీటర్ల ప్రయాణం..!" శీర్షికన కథనం ప్రచురితమైంది. ఈ కథనానికి రాష్ట్ర మహిళా కమిషన్ సభ్యురాలు, మాజీమంత్రి మణికుమారి స్పందించారు. పాడేరు అంగన్​వాడీ సూపర్​వైజర్​లను వెంటబెట్టుకొని... అరుణ ఇంటికి వెళ్లారు. గర్భిణీగా ఉన్నప్పుడు తీసుకోవాల్సిన జాగ్రత్తలు వివరించారు. ఆసుపత్రిలోనే ప్రసవం చేయించుకోవాలని అరుణకు చెప్పారు. అనంతరం అంగన్​వాడీ కార్యాకర్తలు, గ్రామస్థులతో కలిసి అరుణకు సీమంతం చేశారు.

ABOUT THE AUTHOR

...view details