ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

'ఈటీవీభారత్' కథనానికి స్పందన... నిధుల దుర్వినియోగంపై విచారణ - visakha latest unusage of funds

ఈటీవీ భారత్ కథనానికి విశాఖ జాయింట్ కలెక్టర్ స్పందించారు. భీమునిపట్నం మండలం రేఖవానిపాలెంలో అధికారులు విచారణ చేపట్టారు.

respond to bharat story inquiry on sarpanch  in visakha
విచారణ చేస్తున్న అధికారులు

By

Published : Dec 6, 2019, 11:45 PM IST

నిధులు దుర్వినియోగంపై గ్రామస్థులు గత నెల 30న అంబేద్కర్ విగ్రహానికి వినతిపత్రం అందజేశారు. 'అంబేద్కర్ విగ్రహానికి వినతిపత్రం' అనే శీర్షికతో ఈటీవీభారత్​లో కథనం ప్రచురితమైంది. ఈ కథనానికి విశాఖ జాయింట్ కలెక్టర్ స్పందించి విచారణకు ఆదేశించారు. భీమునిపట్నం మండలం రేఖవానిపాలెంలో అధికారులు విచారణ చేపట్టారు. మాజీసర్పంచ్, కార్యదర్శి గత ఐదేళ్లలో ఎన్నో అవకతవకలకు పాల్పడ్డారని గ్రామస్థులు ఆరోపించారు. ఈ విషయాన్ని ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళతామని డీఎల్​పీఓ కొండలరావు తెలిపారు.

విచారణ చేస్తున్న అధికారులు

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details