వైరస్ను లెక్క చేయకుండా పంటలు పండించి దేశానికి అన్నం పెడుతున్న రైతులకు... వ్యవసాయ కార్మిక సంఘం నాయకులు పాదాభివందనం చేశారు. విశాఖపట్నం జిల్లా మాడుగుల నియోజకవర్గం దేవరాపల్లి హోల్ సేల్ కాయగూరలు మార్కెట్లో సన్మాన కార్యక్రమాన్ని నిర్వహించారు. కష్టకాలంలో రైతులు పండించిన పంటలకు గిట్టుబాటు ధర లభించలేదని కార్మిక సంఘం నాయకులు ఆవేదన వ్యక్తం చేశారు.
అన్నదాతలకు పాదాభివందనం చేసిన నాయకులు - corona cases in vizag
లాక్ డౌన్ కారణంగా పెద్దపెద్ద కంపెనీలు తమ ఉద్యోగులకు వర్క్ ఫ్రం హోం ఇచ్చేశాయి. కొన్ని సంస్థలు మొత్తానికే మూతపడ్డాయి. కానీ కరోనా వైరస్ అయినా..ఇంకే విపత్తు వచ్చినా రైతు మాత్రం ఇంటికి పరిమితం కాకుండా...దేశానికి అన్నం పెడుతున్నాడు. అలాంటి అన్నదాతలకు పాదాభివందనం చేశారు వ్యవసాయ కార్మిక సంఘం నాయకులు.
http://10.10.50.85//andhra-pradesh/17-May-2020/ap-vsp-114-17-raithulaku-padabi-vandanam-av-ap10152_17052020224241_1705f_1589735561_350.jpg