గిరిజన సంక్షేమ శాఖలో పనిచేస్తున్న ఒప్పంద రెసిడెన్షియల్ ఉపాధ్యాయుల సమస్యలు పరిష్కరించాలని కోరుతూ... విశాఖపట్నం జిల్లా పాడేరులో ఉపాధ్యాయులు ఆందోళన చేపట్టారు. గిరిజన బాలుర పాఠశాల నుంచి అంబేడ్కర్ కూడలి వరకు ర్యాలీ చేశారు. ఏళ్లుగా పని చేస్తున్న తమను స్కూల్ అసిస్టెంట్ విధుల నుంచి సెకండరీ గ్రేడ్ టీచర్లుగా డీప్రమోట్ చేయడం దారుణమని ఆవేదన చెందారు. తమ సమస్యలపై ముఖ్యమంత్రి స్పందించి, పరిష్కరించాలని విజ్ఞప్తి చేశారు.
పాడేరులో రెసిడెన్షియల్ ఉపాధ్యాయుల ఆందోళన - Paderu latest news updates
విశాఖపట్నం జిల్లా పాడేరులో ఉపాధ్యాయులు ఆందోళన చేశారు. స్కూల్ అసిస్టెంట్ స్థాయి నుంచి ఎస్జీటీగా డీప్రమోట్ చేయడంపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.
పాడేరులో రెసిడెన్షియల్ ఉపాధ్యాయుల ఆందోళన