ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

'ముందుగానే సాగుకు నీరివ్వండి' - Reservoir Irrigation Committee latest news

కోనాం మధ్య తరహా జలాశయం నుంచి నీటి విడుదలపై జలాశయం సాగునీటి కమిటీ సమావేశమైంది. వల్ల నాట్లు వేయడానికి రైతులు ముందుగానే నీళ్లు అడుగుతున్నారని.. జలాశయంలో కాడా సమృద్ధిగా నీటినిల్వలు ఉన్నందున గతేడాది కంటే ముందుగానే సాగునీరు విడుదల చేయాలని అధికారులను కోరారు.

Reservoir Irrigation Committee
జలాశయం సాగునీటి కమిటీ సమావేశం

By

Published : Jul 19, 2020, 8:07 PM IST


విశాఖపట్నం జిల్లా చీడికాడ మండలం కోనాం మధ్యతరహా జలాశయం నుంచి ఆయకట్టుకు సాగునీటి విడుదలకు జలాశయం సాగునీటి కమిటీ ఏకగ్రీవంగా తీర్మానం చేశారు. జలాశయం సాగునీటి సంఘాల ఛైర్మన్ గండి ముసలినాయుడు అధ్యక్షతన నిర్వహించిన సమావేశానికి చీడికాడ, మాడుగుల, బుచ్చయ్యపేట మండలాలకు చెందిన సాగునీటి సంఘం అధ్యక్షులు, డైరెక్టర్లు పాల్గొన్నారు.

ఆగస్టు మొదటి వారంలో సాగునీటి విడుదలపై చేసిన తీర్మానం జలవనరుల శాఖ ఈఈ, స్థానిక ఎమ్మెల్యేకు పంపించినట్లు ముసలినాయుడు తెలిపారు. వరి ఆకు ఎదుగుదలకు చేరుకోవడం వల్ల నాట్లు వేయడానికి రైతులు ముందుగానే నీళ్లు అడుగుతున్నారని.. గతేడాది కంటే ముందుగానే నీటిని విడుదల చేయాలని అధికారులను కోరినట్లు వెల్లడించారు.

ఇవీ చూడండి...

విశాఖ మన్యంలో యువకుని హత్య

ABOUT THE AUTHOR

...view details