ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

'నా భర్త మరణానికి కారకులైన వారిని శిక్షించండి' - కణమాంలో మంత్రి అవంతి శ్రీనివాసరావు వార్తలు

విశాఖ జిల్లా వేమగొట్టిపాలెంలో ఓ గొడవలో మరణించిన వ్యక్తి కుటుంబీకులు మంత్రి అవంతి శ్రీనివాసరావుకు వినతిపత్రం అందజేశారు. ఆనందపురం మండలంలోని కణమాంలో జరిగిన రైతుభరోసా కార్యక్రమానికి మంత్రి హాజరయ్యారు.

Request from the family of the deceased  man of Vemagottipalem to Minister Avanti
మంత్రి అవంతికి వేమగొట్టిపాలెం మృతుని కుటుంబీకుల వినతి

By

Published : Oct 28, 2020, 8:35 PM IST

విశాఖ జిల్లా ఆనందపురం మండలం కణమాంలో రైతు భరోసా కార్యక్రమానికి మంత్రి అవంతి శ్రీనివాసరావు హాజరయ్యారు. వేమగొట్టిపాలెంలోని వాగ్వాదంలో మరణించిన శిణగం రమణ కుటుంబీకులు మంత్రికి వినతిపత్రం అందజేశారు. అతని మృతికి కారణమైన నిందితులను అరెస్టు చేయాలని మృతుడి భార్య డిమాండ్ చేశారు.

స్పందించిన మంత్రి .. బాధితులకు న్యాయం చేయాలని సీఐ రవికి సూచించాారు. ఈ విషయమై సీఐని వివరణ కోరగా ఇప్పటికే కేసులో ఒకరిని అదుపులోకి తీసుకుని.. కోర్టు ఆదేశాల మేరకు రిమాండుకు తరలించామని వెల్లడించారు. విచారణ చేస్తున్నట్టు చెప్పారు.

ABOUT THE AUTHOR

...view details