విశాఖ జిల్లా అనకాపల్లిలో గణతంత్ర వేడుకలను ఘనంగా నిర్వహించారు. అన్ని ప్రభుత్వ కార్యాలయాలు, పోలీస్స్టేషన్లు, ఎన్టీఆర్ జిల్లా ఆసుపత్రిలో గణతంత్ర వేడుకలు ఘనంగా జరిగాయి. ఆర్డీఓ కార్యాలయం వద్ద జాతీయ జెండాను ఆర్డీఓ సీతారామారావు ఆవిష్కరించగా... జీవీఎంసీ జోనల్ కార్యాలయం వద్ద జోనల్ కమిషనర్ శ్రీరామమూర్తి త్రివర్ణ పతాకాన్ని ఎగురవేశారు.
వంజంగి కొండల్లో జాతీయ పతాకవిష్కరణ...
పర్వతారోహకుడు లాయర్ కృష్ణ ప్రసాద్ ఆధ్వర్యంలో పాడేరు మండలానికి చెందిన యువత... వంజంగి మేఘాల కొండల్లో జాతీయ పతాకం ఎగురవేశారు. పర్యాటకులు సైతం ఉత్సాహంగా పాల్గొన్నారు. ఒక రోజు ముందుగా లాయర్ కృష్ణ ప్రసాద్ తన మిత్ర బృందంతో.. లగిసపల్లికొండలో స్వచ్ఛ భారత్ కార్యక్రమం చేపట్టి ప్లాస్టిక్ వ్యర్థాలను తొలగించారు. పర్యాటకులకు అవగాహన కల్పించి పర్యాటక ప్రాంతాన్ని అందంగా ఉంచాలని సూచించారు.
ఇదీ చదవండి:
'కేంద్ర బలగాలతో స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించాలి'