విశాఖ తూర్పు నౌకాదళ ప్రధాన స్థావరంలోని ఐఎన్ఎస్ సర్కార్ పరేడ్ మైదానంలో గణతంత్ర దినోత్సవం ఘనంగా జరిగింది. తూర్పు నౌకాదళ ప్రధానాధికారి, వైస్ అడ్మిరల్ అతుల్ కుమార్ జైన్ వేడుకలకు హాజరయ్యారు. నౌకాదళ సిబ్బందికి, వారి కుటుంబసభ్యులకు శుభాకాంక్షలు తెలిపారు. పోర్టు మైదానంలో గణతంత్ర వేడుకలను ఛైర్మన్ కె.రామ్మోహన్రావు ప్రారంభించారు. పోర్టులోని వివిధ విభాగాల్లో ప్రతిభ కనబరిచిన ఉద్యోగులు, అధికారులకు ప్రశంసాపత్రాలు అందజేశారు. రైల్వే క్రీడా మైదానంలో జరిగిన వేడుకల్లో వాల్తేర్ డీఆర్ఎం చేతన్ కుమార్ శ్రీవాస్తవ్ జాతీయ పతాకాన్ని ఎగురవేశారు.
విశాఖలో ఉత్సాహంగా... గణతంత్ర వేడుకలు - విశాఖపట్నం జిల్లాలో గణతంత్ర వేడుకలు తాజా వార్తలు
విశాఖ పోలీస్ మైదానంలో 71వ గణతంత్ర వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ వేడుకల్లో జిల్లా కలెక్టర్ వి.వినయ్ చంద్ ముఖ్యఅతిథిగా పాల్గొని జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. సాయుధ పోలీస్, ఎన్సీసీ విద్యార్థుల గౌరవ వందనం స్వీకరించారు.
పాడేరు గిరిజన సంక్షేమం బాలుర పాఠశాలలో గణతంత్ర ఉత్సవాలు జరిగాయి. ఐటీడీఏ ప్రాజెక్టు అధికారి డీకే బాలాజీ జెండా ఆవిష్కరణ చేశారు. అరకులోయలో స్థానిక తహసీల్దార్ కార్యాలయంలో ఎమ్మార్వో శ్యాంబాబు జాతీయ జెండాను ఎగురవేశారు. నర్సీపట్నం ఆర్డీవో కార్యాలయంలో... ఆర్డీవో లక్ష్మీ శివజ్యోతి గణతంత్ర దినోత్సవం సందర్భంగా పతాకావిష్కరణ చేశారు. కార్యాలయ ప్రాంగణంలో మొక్కలు నాటే కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. చోడవరంలోని వివిధ ప్రభుత్వ కార్యాలయాల్లో గణతంత్ర దినోత్సవాన్ని ఘనంగా జరుపుకున్నారు. మువ్వన్నెల జెండాను ఎగురవేశారు. ఉద్యోగులు, విద్యార్థులకు ఆటల పోటీలు నిర్వహించి.. గెలిచిన వారికి బహుమతులు అందజేశారు.
ఇదీ చదవండి: