గిరిజన సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో పాడేరులో జరిగిన గణతంత్ర దినోత్సవాల్లో విద్యార్థుల నృత్యాలు ఆకట్టుకున్నాయి. ముఖ్య అతిథిగా ఐటీడీఏ ప్రాజెక్టు అధికారి డాక్టర్ వెంకటేశ్వర్ కుటుంబ సమేతంగా హాజరయ్యారు. పాడేరు పరిసరాల్లో గిరిజన సంక్షేమ శాఖ గురుకులం, శ్రీ కృష్ణాపురం పాఠశాలలకు చెందిన విద్యార్థులు చేసిన నృత్యాలు అలరించాయి.
పాడేరు తలారసింగి పాఠశాల విద్యార్థులు రింగుల మంటల మధ్య చేసిన సాహస ప్రదర్శనలు మంత్రముగ్ధుల్ని చేశాయి. కొయ్యూరు రెజ్లింగ్ అసోసియేషన్ ఆధ్వర్యంలో విద్యార్థులు వారి క్రీడా పాఠవాన్ని చూపించారు. సాంస్కృతిక కార్యక్రమాల్లో ప్రతిభ కనబరిచిన విద్యార్థులకు బహుమతులు అందజేశారు.