ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

తూర్పు నౌకాద‌ళంలో ఘనంగా గణతంత్ర దినోత్సవం - తూర్పు నౌకాద‌ళంలో గణతంత్ర దినోత్సవ వేడుకలు

గణతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకొని విశాఖలో ఐఎన్ఎస్ స‌ర్కార్స్ మైదానంలో వేడుకలు నిర్వహించారు. తూర్పునౌకాద‌ళ ప్ర‌ధానాధికారి వైస్ అడ్మిర‌ల్ అతుల్ కుమార్ జైన్... మువ్వన్నెల జెండాను ఆవిష్కరించి వివిధ విభాగాల సిబ్బంది నుంచి గౌరవ వందనం స్వీకరించారు.

Republic Day Parade Eastern Fleet
తూర్పు నౌకాద‌ళంలో గణతంత్ర దినోత్సవ వేడుకలు

By

Published : Jan 26, 2021, 7:45 PM IST

తూర్పు నౌకాద‌ళం ప్ర‌ధాన ప్రాంగ‌ణంలో గ‌ణతంత్ర‌ వేడుకలు ఘ‌నంగా నిర్వ‌హించారు. ఈ సందర్బంగా విశాఖ‌లోని ఐఎన్ఎస్ స‌ర్కార్స్ మైదానంలో నౌకాద‌ళంలో వివిధ విభాగాల బ‌ల‌గాలు క‌వాతు నిర్వహించారు. తూర్పునౌకాద‌ళ ప్ర‌ధానాధికారి వైస్ అడ్మిర‌ల్ అతుల్ కుమార్ జైన్... జాతీయ ప‌తాకాన్ని ఆవిష్క‌రించి బ‌ల‌గాల గౌర‌వ వంద‌నం స్వీక‌రించారు.

ప్ర‌పంచంలోనే ఉన్నత ప్ర‌జాస్వామ్య వ్య‌వ‌స్ధ‌కు పునాది వలే రాజ్యంగ నిర్మాతలు మ‌న రాజ్యాంగాన్ని రూపొందించారని ఏకె జైన్ అన్నారు. దేశ ర‌క్ష‌ణ‌లో ఎక్క‌డా రాజీపడకుండా రక్షణ ద‌ళాల‌న్నీ సంఘ‌టితంగా త‌మ స్ఫూర్తిని ప్ర‌ద‌ర్శిస్తున్నాయ‌న్నారు. అన్నియుద్ద నౌక‌ల‌ను వివిధ సిగ్న‌ల్​ ప‌తాకాల‌తో అలంక‌రించి జాతీయ పండ‌గ వైభ‌వానికి నిద‌ర్శ‌నమ‌య్యాయని గుర్తుచేశారు.

ఇదీ చదవండి:భాజాపా కార్యాలయంలో గణతంత్ర వేడుకలు

ABOUT THE AUTHOR

...view details