విశాఖలోని జవహర్ లాల్ నెహ్రూ ఫార్మా సిటీలో రెండు వారాల వ్యవధిలోనే రెండు భారీ ప్రమాదాలు జరిగాయి. సాయినార్ లైఫ్ సైన్సెస్లో గ్యాస్ లీకేజీ ఘటనలో ఇద్దరు ఉద్యోగులు ప్రాణాలు కోల్పోయిన ఘటన మరువక ముందే విశాఖ సాల్వెంట్స్ భారీ పేలుడు సంభవించింది. సోమవారం అర్ధరాత్రి జరిగిన ప్రమాదంతో ఉద్యోగులు, ప్రజలు తీవ్ర ఆందోళనకు గురయ్యారు. పేలుడు ధాటికి చుట్టు పక్కల హైటెన్షన్ విద్యుత్ తీగలు కాలిపోయాయి. అగ్నికీలల ప్రభావంతో సమీపంలోని చెట్లు మాడిపోయాయి. ప్రమాదం జరిగిన తీరు.. అనంతర పరిస్థితులపై మా ప్రతినిధి అందిస్తోన్న వివరాలు..!
విశాఖ అగ్నిప్రమాదం.. చూపుతోంది నిర్వహణ లోపం..! - visakha pharma city fire accident after situation news
విశాఖలోని ఫార్మాసిటీలో వరుస ప్రమాదాలు కార్మికులు, ప్రజలను ఆందోళనకు గురి చేస్తున్నాయి. రెండు వారాల వ్యవధిలోనే భారీ ప్రమాదాలు జరగడం పరిశ్రమల నిర్వహణ లోపాలను ఎత్తిచూపుతోంది. ప్రమాదం జరిగిన తీరుపై మా ప్రతినిధి అందిస్తున్న వివరాలివి..!
విశాఖ అగ్నిప్రమాదం.. చూపుతోంది నిర్వహణ లోపం..!