డొంకరాయి పవర్ కెనాల్‌కు బీటలు..! - donkarai canal latest news at vizag
రెండు నెలల క్రితం విశాఖ జిల్లాలోని డొంకరాయి పవర్ కెనాల్‌కు గండిపడితే... రూ.కోటి వెచ్చించి మరమ్మతులు చేశారు. నీటిని విడుదల చేశారు. కారణంమేంటో తెలియదు గాని... పవర్ కెనాల్ వింగ్‌వాల్‌కు బీటలు ఏర్పడ్డాయి.
రూ.కోటి వెచ్చించి గండి పనులు పూర్తిచేసి... ఇటీవల కెనాల్ ద్వారా నీటి విడుదల ప్రారంభించారు. దశలవారీగా పవర్ కెనాల్ ఏర్పాటు చేసి పరిస్థితిని అధ్యయనం చేస్తూ... నీటి విడుదల పెంచారు. ఈ క్రమంలో పవర్ కెనాల్‌కు వింగ్‌వాల్‌కు బీటలు ఏర్పడటం గుర్తించారు. వెంటనే నీటి విడుదల నిలిపివేశారు. బీటలు వచ్చిన వింగ్‌వాల్‌కు ఐరన్ రాడ్లు కట్టి... కెమికల్ ట్రీట్మెంట్ చేశారు. అనంతరం కాంక్రీట్ పనులు చేయాలని నిర్ణయించారు. ఎస్ఈ రామకోటి లింగేశ్వరరావును వివరణ కోరగా... గండిపడిన చోట కొత్త, పాత గోడకు మధ్య ఖాళీ వచ్చిందని చెప్పారు.
ఇదీ చూడండి: 'పళ్లెత్తుగా ఉన్నాయని పెళ్లానొదిలేశాడు'