విశాఖ జిల్లాలో దేవదాయ శాఖ పరిధిలో ఉన్న స్థలాలను స్వాధీనం చేసుకునేందుకు ఆ శాఖ అధికారులు శ్రీకారం చుట్టారు. చోడవరం పట్టణంలో స్వయంభు గౌరీశ్వర ఆలయం వద్ద పుష్కరిణి గట్టును అక్రమించి స్థిర నివాసమున్న వారి ఇళ్లు, రేకుల షెడ్డులను తొలగించే పనులు ప్రారంభించారు. సర్వే నెం. 101/1,102/2,101/3లలో 3.78 ఎకరాలలో పుష్కరిణి ఉంది. ఈ పుష్కరిణి చుట్టూ ఉన్న గట్టును కొందరు వ్యక్తులు అక్రమించేశారు. ట్రైబ్యునల్ తీర్పుతో అక్రమ నిర్మాణాలను తొలగిస్తున్నట్లు దేవదాయ శాఖ సహాయక కమిషనర్ కె.శాంతి తెలిపారు. పుష్కరిణి గట్టుపై ఉన్న ఆర్అండ్బీ కార్యాలయానికి నోటీస్ ఇవ్వాలని సహాయక కమిషనర్ అదేశించారు. ఈ తొలగింపులో ఇన్స్పెక్టర్ శ్రీ నివాసరాజు, కార్యనిర్వహణాధికారులు శాస్ర్తీ, సత్యనారాయణ, సిబ్బంది, పోలీస్ సబ్ ఇన్స్పెక్టర్లు పాల్గొన్నారు.
దేవాదాయశాఖ భూముల్లో ఆక్రమణల తొలగింపు - విశాఖ జిల్లాలో అక్రమణలు తొలగింపు వార్తలు
విశాఖ జిల్లాలో దేవదాయ శాఖ పరిధిలోని భూముల్లో ఉన్న అక్రమ నిర్మాణాలను అధికారులు తొలగిస్తున్నారు. స్వయంభు గౌరీశ్వర ఆలయం వద్ద పుష్కరిణి గట్టుపై పలు ఇళ్లను ఖాళీ చేయించారు.
విశాఖ జిల్లాలో దేవదాయశాఖ పరిధిలో ఉన్న అక్రమణలు తొలగింపు
ఇదీ చూడండి. 'మరింత పకడ్బందీగా అమలు చేయడానికే..నగదు బదిలీ తీసుకొచ్చాం'