విశాఖ జిల్లా గొలుగొండ మండలం జోగంపేట పాఠశాలలో ఉన్న గ్రానైట్‌ను వాహనంలో తరలిస్తుండగా గ్రామస్థులు అడ్డుకున్నారు. నాడు- నేడు కార్యక్రమంలో భాగంగా అభివృద్ధి పనులు చేసేందుకు నిల్వ ఉంచిన గ్రానైట్ రాళ్లను రాత్రి సమయంలో వాహనాల్లో తరలించడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. స్థానిక పోలీసులను పిలిచి విచారణ చేపట్టాలని కోరారు. పోలీసులు, పాఠశాల ఉపాధ్యాయులను, మండల విద్యాశాఖ అధికారులను అడిగి వివరాలు తెలుసుకుంటున్నారు.
బడిలో నిల్వ ఉంచిన గ్రానైట్ తరలింపు.. అడ్డుకున్న గ్రామస్థులు - Visakhapatnam District Latest News
గొలుగొండ మండలం జోగంపేట పాఠశాలలో నాడు- నేడు కార్యక్రమంలో భాగంగా అభివృద్ధి పనులు చేసేందుకు నిల్వ ఉంచిన గ్రానైట్ రాళ్లను తరలించడాన్ని గ్రామస్థులు అడ్డుకున్నారు. స్థానిక పోలీసులను పిలిచి విచారణ చేపట్టాలని కోరారు.
బడిలో నిల్వ ఉంచిన గ్రానైట్ తరలింపు
TAGGED:
విశాఖ జిల్లా తాజా వార్తలు