విశాఖ జిల్లా నర్సీపట్నంలో గురువారం వర్షం కురవడంతో ఆ ప్రాంతానికి కాస్త ఉపశమనం కలిగించింది. మధ్యాహ్నం వరకు ఎండ, ఉక్కబోతతో ఉన్న వాతావరణం మధ్యాహ్నానికి మారింది. నర్సీపట్నంతో పాటు రోలుగుంట, రావికమతం, మాకవరపాలెం తదితర మండలాల్లో వడగళ్ల వర్షం కురిసింది. వర్షం రాకతో వాణిజ్య పంట రైతులు కాస్త ఊపిరి పీల్చుకున్నారు.
వర్షంతో ఉపశమనం...!
మధ్యాహ్నం వరకు ఉక్కబోత పోయించిన ఎండలు... ఒక్కసారిగా వాతావరణంలో అన్యూహ్యమైన మార్పులు చెంది ఉరుములతో కూడిన వర్షం పడటంతో విశాఖ జిల్లా నర్సీపట్నం ప్రాంతానికి కాస్త ఉపశమనం కలిగించింది. గురువారం ఒక్కసారిగా మబ్బులు పట్టి నర్సీపట్నంతో పాటు రోలుగుంట, రావికమతం, మాకవరపాలెం తదితర మండలాల్లో వడగళ్ల వర్షం కురిసింది.
విశాఖ జిల్లాలోని పలు ప్రాంతాల్లో వర్షం