విశాఖపట్నం జిల్లా చీడికాడ మండలం కోనాం జలాశయం నుంచి వరద నీటిని దిగువకు విడుదల చేశారు. వర్షాలు తగ్గినా... ఎగువ ప్రాంతాల కొండ గెడ్డల నుంచి రిజర్వాయర్లోకి భారీగా వరద నీరు చేరుతోంది. బొడ్డేరు నదిలోకి 260 క్యూసెక్కుల నీటిని అధికారులు విడుదల చేశారు. జలాశయం పూర్తిస్థాయి నీటిమట్టం 101.25 మీటర్లు ..ప్రస్తుతం 100.65 మీటర్లుగా ఉంది. నదిలో ఎవరు దిగొద్దని అధికారులు సూచించారు.
కోనాం జలాశయం నుంచి వరద నీరు విడుదల - కోనాం జలాశయం నుంచి భారీగా వరద నీరు వార్తలు
ఎగువప్రాంతాల నుంచి భారీగా వరద నీరి కోనాం జలశయం నిండుకుండలా కనిపిస్తోంది. అధికారులు వరదనీటిని దిగువకు వదిలారు.
దిగువకు వెళ్తున్న వరద నీరు