రాష్ట్ర వ్యాప్తంగా బీఈడీ కోర్సుల్లో ప్రవేశాల కోసం నిర్వహించిన ఎడ్‌సెట్ 2020 ఫలితాలను ఆంధ్ర విశ్వవిద్యాలయం ఉపకులపతి ఆచార్య పీవీజీడీ ప్రసాద్‌రెడ్డి విడుదల చేశారు. ఈ అర్హత పరీక్షకు 10వేల 363 మంది హాజరు కాగా.. 10వేల 267 మంది అర్హత సాధించారు. ఎడ్‌సెట్‌లో అర్హత సాధించిన వారి శాతం 99 పాయింట్‌గా ఉంది. మొత్తం రాష్ట్రంలో 50 కేంద్రాల్లో ఈ పరీక్ష నిర్వహించారు. గణితశాస్త్రంలో 3028 మంది, భౌతిక శాస్త్రంలో 1341 మంది, బయలాజికల్ సైన్స్‌లో 2,249 మంది, సోషల్ స్టడీస్‌లో 3141 మంది, ఆంగ్లంలో 508 మంది అర్హత పొందారు.
ఎడ్‌సెట్ 2020 ఫలితాల విడుదల - ఏపీ ఎడ్‌సెట్ ఫలితాల విడుదల వార్తలు
ఎడ్‌సెట్ 2020 ఫలితాలను ఆంధ్ర విశ్వవిద్యాలయం ఉపకులపతి ఆచార్య పీవీజీడీ ప్రసాద్‌రెడ్డి విశ్వవిద్యాలయంలో విడుదల చేశారు. ఈ అర్హత పరీక్షలో 10 వేల 363 మంది హాజరు కాగా... 10 వేల 267 మంది అర్హత సాధించారు.
ఎడ్‌సెట్ 2020 ఫలితాల విడుదల