ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

ఏడీ, ఏజీలపై అభియోగాల నమోదు.. - విశాఖ గ్రావెల్‌ తరలింపు వ్యవహారంలో ప్రభుత్వం చర్యలు

విశాఖ జిల్లా పెదగంట్యాడ మండలంలో వక్ఫ్‌ బోర్డుకు చెందిన భూముల్లో నిబంధనలు ఉల్లంఘించి.. గ్రావెల్‌ తరలించినా నిర్లక్ష్యం వహించి, పర్మిట్లు జారీచేసిన గనులశాఖ అధికారులుపై ప్రభుత్వం అభియోగాలు నమోదుచేస్తూ ఉత్తర్వులు జారీచేసింది.

case on ad,ag
case on ad,ag

By

Published : Nov 24, 2020, 7:38 AM IST

విశాఖ జిల్లా పెదగంట్యాడ మండలం దేవాడలో సర్వే నంబరు 493లో వక్ఫ్‌ బోర్డుకు చెందిన భూముల్లో నిబంధనలు ఉల్లంఘించి గ్రావెల్‌ తరలించినా నిర్లక్ష్యం వహించి, పర్మిట్లు జారీచేసిన గనులశాఖ సహాయ సంచాలకులు(ఏడీ) సూర్యచంద్రరావు, సహాయ భూవిజ్ఞాన నిపుణుడు(ఏజీ) గుండు శివాజీలపై అభియోగాలు నమోదు చేస్తూ ప్రభుత్వం సోమవారం ఉత్తర్వులు జారీచేసింది. ఆ భూముల్లో రెండేళ్లపాటు గ్రావెల్‌ తవ్వకాలకు కె.శ్రీనివాసరాజు అనే వ్యక్తి 2008లో దరఖాస్తు చేసుకున్నారు. వక్ఫ్‌బోర్డుతోనూ ఒప్పందం చేసుకున్నారు.

అయితే 2011, జూన్‌ నుంచి ఏడాది పాటు క్వారీ లీజును గనులశాఖ మంజూరు చేసింది. కానీ లీజుదారుడు వక్ఫ్‌బోర్డుతో చేసుకున్న ఒప్పందం గడువు పొడిగించుకోలేదు. ఈ విషయం తెలిసినప్పటికీ ఏడీ, ఏజీలు పలు దఫాలుగా 1.94 లక్షల క్యూబిక్‌మీటర్ల గ్రావెల్‌ తరలింపునకు పర్మిట్లు జారీచేశారు. దీనిపై వక్ఫ్‌బోర్డు, సీబీఐకి ఫిర్యాదు చేయడంతో 2016లో కేసు నమోదు చేసి విచారణ చేపట్టారు. వక్ఫ్‌బోర్డుతో లీజు గడువు పొడిగించుకోకపోయినా.. అధికారులు పర్మిట్లు ఇచ్చినట్లు సీబీఐ తన నివేదికను గనులశాఖకు పంపింది. దీంతో ఏడీ, ఏజీపై అభియోగాలు నమోదు చేస్తూ గనులశాఖ ముఖ్య కార్యదర్శి గోపాలకృష్ణ ద్వివేది ఉత్తర్వులు జారీచేశారు. పది రోజుల్లో ఆ ఇద్దరు అధికారులు తమ వివరణ ఇవ్వాల్సి ఉంటుందని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు.

ఇదీ చదవండి:రాష్ట్రానికీ నివర్‌ ముప్పు... చిత్తూరు జిల్లాను తాకనున్న తీవ్ర తుపాను

ABOUT THE AUTHOR

...view details