Records Achieved by VisakhapatnamWomen in Chess Game :చదరంగంలో రాణించాలన్న ఆమె అభిలాషకు వెన్నంటే నిలిచాడు తండ్రి. ప్రభుత్వ ఉద్యోగం సైతం వదులుకుని.. అన్ని రకాలుగా ప్రోత్సహిస్తున్నారు. అలా తండ్రి శిక్షణతో తన ప్రతిభకు పదును పెట్టుకున్న ఆ అమ్మాయి.. జూనియర్ విభాగంలో అనేక పతకాలు సాధించింది. చెస్ పండితుల్ని సైతం ఆశ్చర్యపరుస్తూ.. తొమ్మిదేళ్లకే అంతర్జాతీయ రేటింగ్‌నూ పొందింది. అంతర్జాతీయ టోర్నీల్లోనూ తనదైన ప్రతిభ కనబరుస్తూ ముందుకు సాగుతోంది.
Visakhapatnam Girl Sahithi Achievements in Chess Game :సాహితీ వర్షిణిది విశాఖ. తండ్రి లోకేశ్వర్‌రావు హెచ్‌పీసీఎల్ లో ఉద్యోగిగా పనిచేసేవారు. తల్లి జయశ్రీ. సాహితీ సోదరి ఫల్గుణి కూడా చెస్ క్రీడాకారిణే. ఎనిమిది ఏళ్లప్పుడు నాన్న, అక్క చెస్ ఆడటం చూశాక.. తనకు ఆ దిశగా ఆసక్తి కలిగిందంటోంది వర్షిణి. కుమార్తె ఇష్టం చూసి తల్లిదండ్రులు వెన్నుదన్నుగా నిలిచారు. స్వతహాగా చెస్ ప్రియుడైన తండ్రి లోకేశ్వర్.. కుమార్తె ఇష్టం, నిబద్ధత గమనించి తానే కోచ్‌గా మారి ఆటలో మెళకువలు నేర్పించారు.
మహిళా గ్రాండ్ మాస్టర్‌గా నిలిచిన మూడో తెలుగమ్మాయి
ఇంతితై వటుడింతై అన్నట్టు అనతికాలంలోనే అండర్ టెన్ విభాగంలో ప్రపంచస్థాయి టోర్నీల్లో పాల్గొంది ఈ యువతి. వివిధ దేశాలతో పోటీపడి స్వర్ణ పతకాలూ సాధించింది. ఆటలో కుమార్తె మరింత ప్రగతి సాధించాలని హెచ్‌పీసీఎల్ లో ఉద్యోగాన్నీ వదులుకున్నాడు తండ్రి లోకేశ్వర్. వివిధ దేశాల టోర్నీలకు వెళ్లేందుకు ఆర్థిక ఇక్కట్లు కలిగినా.. అవేవి వర్షిణి ఆటపై ప్రభావం చూపలేకపోయాయి.
Chess Player Sahithi Achievements :జలంధర్‌లో జరిగిన జాతీయ టోర్నీలో పోటీపడి రెండవ స్థానం సాధించింది సాహితీ. ఉజ్బెకిస్థాన్‌లో అండర్ టెన్ ఆసియా, దిల్లీ కామన్వెల్త్ యూత్ విభాగంలోబంగారు పతకాలుసొంతం చేసుకుంది. బ్రెజిల్‌లో జరిగిన వరల్డ్ ఛాంపియన్‌షిప్‌లో కొద్దిలో కాంస్యం చేజారింది. ఐనా రెట్టించిన ఉత్సాహంతో థాయ్‌లాండ్ ఆసియా పోటీల్లో అండర్12లో ఆరు స్వర్ణాలు ఒడిసిపట్టింది. ఎప్పటికప్పుడు ర్యాంకింగ్‌ను మెరుగుపర్చుకుంటూ విజయ పరంపర కొనసాగిస్తోంది.