నర్సీపట్నంలో బస్సులు సిద్ధం - latest news narsipatnam rtc depot
సుమారు 50 రోజుల తర్వాత ఆర్టీసీ బస్సులు రోడ్డెక్కనున్నాయి. ఈనెల 21నుంచి పరిమితంగా నడపడానికి అధికారులు నిర్ణయం తీసుకున్నారు. కరోనా వ్యాప్తి చెందకుండా అవసరమైన జాగ్రత్తలు పాటిస్తూ బస్సులను నడపడానికి సన్నాహాలు చేస్తున్నారు.
విశాఖ జిల్లా నర్సీపట్నం ఆర్టీసీ డిపో పరిధిలో సుమారు 90 బస్సులున్నాయి. వీటిని తెలంగాణతోపాటు... రాష్ట్రంలోని విజయవాడ, విశాఖపట్నం, తూర్పుగోదావరి, పశ్చిమగోదావరి, చింతపల్లి, సీలేరు, మల్కనాగిరి, చిత్రకొండ తదితర ప్రాంతాలకు నడుపుతూ రోజూ లక్షన్నరకుపైగా అదాయాన్ని తీసుకొచ్చేవి. కరోనా కారణంగా 50 రోజులపాటు సర్వీసులు నిలిపివేశారు. రాష్ట్రంలో పరిస్థితులు కుదుటపడిన నేపథ్యంలో వీటిని నడపడానికి అధికారులు చర్యలు చేపట్టారు. నిబంధనలు మేరకు ఉదయం 7 గంటల నుంచి రాత్రి 7 వరకు మాత్రమే పరిమితమైన ప్రయాణికులతో నడపాలని భావిస్తున్నారు.
ఇదీ చూడండి:విశాఖ ఎల్‌జీ పాలిమర్స్ పరిశ్రమ వద్ద ఆందోళన