వ్యక్తుల ఆదాయంతో సంబంధం లేకుండా ఆస్తి పన్ను రిటర్న్ దాఖలు చేసిన వారిలో బియ్యంకార్డుదారులకు రాష్ట్ర ప్రభుత్వం రేషన్ నిలిపివేసింది. ఈ మేరకు విశాఖజిల్లా పౌరసరఫరాలశాఖ ఆదేశాలు జారీ చేసింది. ఈ నెల సరుకుల కోసం రేషన్ దుకాణాలకు వెళ్లిన వారి వివరాలు ఈపాస్ యంత్రంలో చూపించకపోవటంతో వారికి సరుకులు అందించటం లేదు. పట్టణంలో గత రెండు రోజుల్లో 400మందిలో 30మందికి సరకులు నిలిచిపోయాయని డీలర్లు తెలిపారు.
విషయం తెలియక వార్డు, గ్రామ వాలంటీర్లను వాకబు చేస్తున్నారు. ఆదాయపన్ను రిటర్న్ దాఖలు చేసి ఉండటం వల్ల సరుకులు నిలిపేశారని వారు చెబుతున్నారు. వాస్తవంగా ఐటీ పన్ను చెల్లించే వ్యక్తులకు రేషన్ నిలిపివేయొచ్చు. కానీ వివిధ అవసరాల నిమిత్తం పన్ను రిటర్న్స్ దాఖలు చేసిన వారందరికీ రేషన్ నిలిపివేయటం ఆందోళన కలిగించే అంశం.