ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

యథావిధిగా రేషన్ బియ్యం పంపిణీ.. అధికారుల భరోసా - vishakha ration news

కరోనా విజృంభిస్తున్నప్పటికీ ఇంటింటికీ రేషన్ బియ్యం పంపిణీ యథావిధిగా కొనసాగుతోందని విశాఖ జిల్లా అధికారులు చెబుతున్నారు. పాక్షిక కర్ఫ్యూ కొనసాగుతున్నప్పటికీ సరుకుల పంపిణీకి ఎలాంటి ఆటంకం ఉండదని భరోసా ఇస్తున్నారు.

ration
ration

By

Published : May 6, 2021, 8:13 PM IST

కరోనా ఉద్ధృతి కొనసాగుతున్నప్పటికీ రేషన్ బియ్యం పంపిణీలో ఎలాంటి ఆటంకం ఉండదని అధికారులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. సరుకుల పంపిణీని యథావిధిగా చేపడతామని చెబుతున్నారు. పాక్షిక కర్ఫ్యూ ప్రభావం పంపిణీపై పడదన్నారు.

వాలంటీర్లకు కీలక బాధ్యతలు..

రేషన్ సరుకులను అందజేసే బాధ్యతను వాలంటీర్లకు అప్పగించనున్నారు. కరోనా నేపథ్యంలో ప్రభుత్వ ఆదేశాల మేరకు ఈ నెల ఉచితంగా రేషన్ సరకుల పంపిణీ చేపట్టాల్సి ఉండగా.. ఈ ప్రక్రియ తమకు భారమని.. కమిషన్​ను రెట్టింపు చేయాలని డీలర్లు ఆందోళన చేస్తున్నారు.

రేషన్ సరుకుల పంపిణీకి సంబంధించి సమస్యలు తలెత్తితే తక్షణమే పరిష్కరించేందుకు కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేశామని అధికారులు చెబుతున్నారు. 8886671713 అనే నెంబర్​కు ఫోన్ చేయాలని అధికారులు సూచిస్తున్నారు.

ఇదీ చదవండి:

పెద్ద బొడ్డేపల్లిలో పురుషుల కొవిడ్ కేంద్రం ప్రారంభం

ABOUT THE AUTHOR

...view details