అక్రమంగా రేషన్ బియ్యం తరలింపు..పట్టుకున్న ఎస్ఐ - ration rice Illegal transport in Gopalapatnam news update
ప్రజలు తినడానికి తిండి లేక ఇబ్బంది పడుతుంటే.. కొంతమంది రేషన్ డీలర్ల మాత్రం చేతివాటం చూపిస్తున్నారు. పేదలకు ప్రభుత్వం ఇచ్చే బియ్యంలో రేషన్ డీలర్లు చేతివాటం చూపిస్తున్నారు. అయితే ప్రభుత్వాలు ఇచ్చిన విధంగా లబ్ధిదారులకు చేరుతున్నాయంటే లేదనే చేప్పాలి. విశాఖలోని గోపాలపట్నంలో అక్రమంగా రేషన్ బియ్యాన్ని పక్కదారి పట్టిస్తున్న వాహనాలను సీజ్ చేసి, డ్రైవర్లను అదుపులోకి తీసుకున్నారు.

విశాఖ గోపాలపట్నంలో రేషన్ డీలర్ల చేతివాటం చూపిస్తూ.. బియ్యాన్ని పక్కదారి పట్టిస్తున్నారు. ఎక్కువ ధరకు మిల్లులకు అమ్ముకుంటూ సొమ్ము చేసుకుంటున్నారు. అక్రమంగా మిల్లులకు తరలిస్తున్న రేషన్ బియ్యాన్ని గోపాలపట్నం పోలీసులు చాకచక్యంగా పట్టుకున్నారు. రేషన్ కార్డు హోల్డర్లు కొన్న బియ్యాన్ని.. రెండు ఆటోల్లో కొత్తపాలెం శివారు భగత్ సింగ్ నగర్ వద్ద అక్రమంగా తరలిస్తున్న బియ్యాన్ని స్థానికుల సమాచారం మేరకు ఎస్ఐ సత్యనారాయణ పట్టుకున్నారు. వీటిని వెంకన్నపాలెం మిల్లులకు తరలిస్తున్నట్లు విచారణలో తేలిందని పోలీసులు వెల్లడించారు. ఆటోలను సీజ్ చేసి ఇద్దరు వ్యక్తులను అదుపులోకి తీసుకున్నామన్నారు.